SP Goush Alam: క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం:  ఎస్పీ గౌష్ ఆలం

సిరాన్యూస్‌, ఆదిలాబాద్‌
క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం:  ఎస్పీ గౌష్ ఆలం
* డ్రగ్స్, సైబర్ క్రైమ్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన
* గుడిహత్నూర్ లో జిల్లా వాలీబాల్ టోర్నమెంట్ ప్రారంభం

క్రీడ‌ల‌తో మాన‌సికోల్లాసం క‌లుగుతుంద‌ని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా యువత, పోలీసు సత్సంబంధాలను మెరుగుపరిచేందుకు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ ను సోమ‌వారం గుడిహత్నూర్ మండలం ఆదర్శ పాఠశాలలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ ప్రారంభించారు. మొదటగా ఆదర్శ పాఠశాల విద్యార్థులు జిల్లా ఎస్పీకి డప్పు వాయిద్యాలు నడుమ ఘనంగా స్వాగతం పలికి వేదికపై ఆహ్వానించారు. మొదటగా క్రీడలకు సంబంధించి జెండాను ఆవిష్కరించి,గాలిలోకి బెలూన్లను పావురాలను వదిలి క్రీడలను ప్రారంభించారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ నందు ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలలోని యువత 50 జట్టలుగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసులు ప్రజల రక్షణ కై, ప్రజల కోసం విధులను నెరవర్తిస్తారని ఎలాంటి భయాందోళనలు లేకుండా పోలీసులతో మమేకం కావాలని తెలిపారు. యువత చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించి జాతీయస్థాయి పోటీలలో పాల్గొని ఎదగాలని జిల్లా ఎస్పీ తెలిపారు. మారుమూల గ్రామాల్లో ఉన్న యువత యొక్క నైపుణ్యాన్ని, క్రీడలపై ఉన్న ఆసక్తిని వెలికి తీసేందుకే ఇలాంటి టోర్నమెంట్లను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి రంగంలోనూ విద్య ,ఆటల్లో ప్రతి ఒక్కరూ పోటీ తత్వాన్ని కలిగి ఉండాలని తెలిపారు. క్రీడలు ఆడటం వల్ల మానసిక శారీరక ప్రశాంతత మరియు యువతకు తమపై ఉన్న విశ్వాసం, నమ్మకం అధికమవుతుందని, క్రీడా స్ఫూర్తి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా ప్రస్తుతం యువత డ్రగ్స్ మరియు సైబర్ క్రైమ్ బారిన పడకుండా ప్రస్తుత సమాజంలో సైబర్ నేరగాళ్లు వినియోగిస్తున్న పద్ధతి, సోషల్ మీడియా యొక్క దుర్వినియోగం, గంజాయి యొక్క దుర్వినియోగం, గంజాయి వాడడం వల్ల భవిష్యత్తు, ఆరోగ్యం పాడవుతుందని తెలియజేశారు. గంజాయి పై తమ మిత్రులకు .కుటుంబ సభ్యులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. సైబర్ క్రైమ్ ఎక్కువగా మొబైల్ ఫోన్ వినియోగించడం సోషల్ మీడియాలో గుర్తుతెలియని వ్యక్తులతో పరిచయాలు ఏర్పరచుకోవడం వల్ల ఎక్కువగా జరుగుతాయని, ఇలాంటివి సంభవించినప్పుడు వెంటనే జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ – 1930 కు గాని, డయల్ 100 కు గాని సమాచారం అందించి సహాయాన్ని పొందవచ్చని తెలిపారు. ఈ క్రీడలు ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా ఆడుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉట్నూర్ డిఎస్పి సిహెచ్ నాగేందర్, సిఐలు భీమేష్, రహీం భాష, ఎస్సైలు ఇమ్రాన్, తిరుపతి, నవీన్, శ్రీకాంత్, కళాశాల అధ్యాపకులు, పీఈటీలు, క్రీడాకారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *