సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సోమవారం ప్రత్తిపాడు లో నియోజకవర్గ టీడీపీ శ్రేణులకు టెలిగ్రామ్ , వాట్సాప్ ల ద్వారా టీడీపీ పార్టీ సభ్యత్వ నమోదు పై అవగాహనా సదస్సు నిర్వహించారు. కాకినాడ పార్లమెంట్ కోఆర్డినేటర్ శివ శంకర్ పార్టీ శ్రేణులకు సభ్యత్వ నమోదు పై శిక్షణ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం నకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే సత్యప్రభ హాజరు అయ్యారు. టీడీపీ కుటుంబ సభ్యుల సంఖ్య పెంచే బాధ్యత ప్రతీ ఒక్కరూ తీసుకోవాలి అని ఈ సందర్బంగా ఆమె శ్రేణులకు పిలుపునిచ్చారు. సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా సభ్యత్వ సంఖ్య పెంచాలి అని ఆమె కోరారు.ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్య లో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు