సిరా న్యూస్,హైదరాబాద్;
అశోక్ నగర్ లో గ్రూపు పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్దులు మరోసారి నిరసనకు దిగారు. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేసారు. గతంలో జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో తప్పులు జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసారు. దాంతో అశోక్ నగర్ లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఒక్కసారిగా నిరసనకారులు అశోక్ నగర్ లోని రోడ్డుపైకి వచ్చారు. దాంతో పోలీసులు భారీ గా మోహరించారు.