సిరా న్యూస్,హైదరాబాద్;
గచ్చిబౌలి పోలీసులు యువతి అత్యాచారం కేసులో నిందితుడిని అరెస్టు చేసారు. ఘటన జరిగిన రోజు తెల్లవారుజామున రెండు గంటల 15 నిమిషాల ప్రాంతంలో బాధితురాలిని నిందితుడు ఆటోలో ఎక్కించుకొని గచ్చిబౌలికి తీసుకెళ్తూ మార్గమధ్యలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో రాపిడో వ్యక్తి ద్వారా బాధితురాలు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
వివిధ బృందాలుగా ఏర్పడి సీసీ కెమెరాలు ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా నేరస్థున్ని అదుపులోకి తీసుకున్నారు. జంగం ప్రవీణ్ అనే వ్యక్తిని ఆల్విన్ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు.