సిరా న్యూస్,కూకట్ పల్లి;
కేపి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కేపి.హెచ్.బి 7వ ఫేజ్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద రోడ్డు దాటుతున్న నరసింహ అనే వ్యక్తిని ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రాజమండ్రి కి చెందిన వ్యక్తి అని ప్రస్తుతం నర్సరీ ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నాడని పోలీసులు తెలిపారు. ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.