ముగ్గురికి కత్తిపోట్లు
సిరా న్యూస్,హైదరాబాద్;
మాంసం దుకాణం ఏర్పాటు విషయo లో ఏర్పడిన వివాదం కత్తిపోట్లకు దారి తీసి ముగ్గురికి గాయాలయ్యాయి. చంచల్గూడలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఎదురుగా ఉన్న షెట్టర్ లో ఒక వ్యక్తి మాంసం దుకాణాన్ని ఏర్పాటు చేయాలనుకున్నాడు, ఇందుకు స్థానికంగా ఉన్న మటన్ దుకాణం వ్యాపారి అభ్యంతరం చేయడంతో వివాదం చెలరేగింది దింతో ఇరువురు వ్యాపారులకు సంబంధించి బంధువులు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర వాగ్వాదం చెలరేగింది.స్థానికులు జోక్యం చేసుకొని ఇరు గ్రూపులను అక్కడి నుంచి వెల్లగొట్టారు. కానీ ఓ వ్యాపారికి చెందిన వ్యక్తులుకత్తులతో డబీర్పురా ROB పక్కనే ఉన్న హౌజ్దార్ ఖాన్ @ జీమాన్ ఖాన్ ఇంటికి వెళ్లి కత్తులతో దాడి చేసి ముగ్గురిని గాయపరిచారు. క్షతగాత్రులను మలక్పేట యశోద ఆసుపత్రికి తరలించారు మాదన్నపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు