సిరా న్యూస్,హైదరాబాద్;
ఈఎస్ ఐ మెట్రో స్టేషన్ వద్ద ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. బళ్లారి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఘటన జరిగింది. అతివేగంతో.. అజాగ్రత్తగా గో టూర్ ట్రావెల్స్ బస్సు దూసుకొచ్చింది. కారును ఢీకొట్టి..కారును ఈడ్చుకెళ్ళింది. గో టూర్ ట్రావెల్స్ బస్సు దూసుకురావడంతో వాహనదారులు, పాదాచారులు పరుగులు పెట్టారు. కారు ముందు భాగాన్ని తుక్కుతుక్కు చేసి గో టూర్ ట్రావెల్స్ బస్సు చివరకు ఆగిపోయింది. వాహనదారులు, జనం కేకలు వేయదంతో డ్రైవర్ కారు లో నుంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ..