సిరా న్యూస్,హైదరాబాద్;
హైదరాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్తుండగా, ప్రమాదం సంభవించింది,ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లడానికి శంషాబాద్ విమానాశ్రయానికి బయలు దేరారు. మార్గమధ్యంలో హఠాత్తుగా ఓ కారు కాన్వాయ్ మధ్యలోకి దూసుకు వచ్చింది, ఆసమయంలో తన కాన్వాయ్ వెనుక వస్తున్న మరో వ్యక్తి కారు కాన్వాయ్ ని ఓవర్టేక్ చేయబోయి సడన్ బ్రేక్ వేశాడు.దీంతో గవర్నర్ బండారు దత్తాత్రేయ కారు ముందుకు వెళ్ళిపోయింది. కాన్వాయ్ లోని మిగిలిన రెండు కార్లు, ఒక అంబులెన్స్ ఒకదాని నొకటి ఢీకొనడంతో కార్లు ధ్వంసమయ్యాయి.ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.