– విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్
సిరా న్యూస్,విజయనగరం;
విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తూ, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఆర్.ఎ.వలస పోలీసు స్టేషను హెడ్ కానిస్టేబుల్ పి.నారాయణరావు కుటుంబానికి ప్రభుత్వం మంజూరు చేసిన అడిషినల్ కార్పస్ ఫండ్ చెక్ ను విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో అక్టోబరు 21న అందజేసారు.
విజయనగరం జిల్లా ఆర్.ఎ.వలస పోలీసు స్టేషన్లో హెచ్.సి.గా పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ పి.నారాయణరావు తే.30-08-2024 దిన అనారోగ్య కారణంగా మరణించగా అతని సతీమణి పి.పార్వతమ్మకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.1 లక్ష అడిషినల్ కార్పస్ ఫండ్ చెక్కును జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాఎస్పీ శ్రీ వకుల్ జిందల్ మాట్లాడుతూ – విధి నిర్వహణలో మృతి చెందిన పోలీసు బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని రాయితీలు సకాలంలో అందే విధంగా చర్యలు చేపడతామన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించేందుకు దరఖాస్తు చేసుకొని, సంబంధిత డాక్యుమెంట్లును త్వరితగతిన జిల్లా పోలీసు కార్యాలయంలో అందజేయాలని పార్వతమ్మకు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ పి.సౌమ్యలత, డిపిఒ ఎఓ పి.శ్రీనివాసరావు, సూపరిండెంట్లు ప్రభాకరరావు, వెంకటలక్ష్మి, డిపిఓ సిబ్బంది మరియు పోలీసు అధికారుల సంఘం అడహాక్ సభ్యులు కె. శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.