సిరా న్యూస్,కాకినాడ;
కాకినాడ నగరంలో కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ కు ఒక ముగింపు వచ్చింది. కాకినాడ నగరంలో టిడిపి కుటమి నేతల మధ్య వివాదం సద్దుమణిగింది. ప్రధానంగా ఉదయం నుంచి ఆర్డీవో ఆఫీస్ వద్ద జనసేన టిడిపి నేతలు మధ్య వివాదానికి అధికారులు అడ్డుకట్టు వేసి ఇరువురి నేతలతో చర్చలు జరిపారు. చర్చలు సత్ఫలించండంతో చివరికి దీపావళి సామానుల దుకాణం షాపు మెక్లారెన్స్ స్కూల్లో పెట్టడానికి అనుమతులు ఇచ్చారు.
అంతకుముందు దీపావళి షాప్ కేటాయింపులో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాసులు వివాదం రాసుకుంది. కాకినాడ నగరంలోని భానుగుడి సెంటర్ వద్ద జనసేన నాయకులకు దీపావళి షాపు కేటాయింపులు ఇచ్చినప్పటికీ మెయిన్ రోడ్ లో తెలుగుదేశం నాయకులకు దీపావళి షాపు కేటాయింపుకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ అధికారులు అడ్డుకోవడంతో కాకినాడ తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు కాకినాడ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ఎదుట రోడ్డుపై పడుకుని నీరసంగా తెలియజేశారు. టిడిపి శ్రేణులు పెద్ద సంఖ్యలో ఆర్డీవో ఆఫీసు వద్దకు చేరుకుని కాకినాడ ఎంపీ తంగెలు ఉదయ శ్రీనివాస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి కాకినాడ ఎంపీ తంగెల్ ఉదయ శ్రీనివాస్ బినామీగా తొత్తుగా వ్యవహరిస్తున్నారని టిడిపి నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు మాట్లాడుతూ కాకినాడ నగరంలో దీపావళి షాప్ అనుమతికి అన్ని పత్రాలు ఉన్నప్పటికీ అధికారులు పైనుంచి ఒత్తులు ఉన్నాయంటూ తమ షాపును అడ్డుకోవడం చాలా దారుణమని.. జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి కి తొత్తుగా వ్యవహరిస్తున్నారని, కాకినాడ నగరంలో ప్రతి విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు వ్యతిరేకంగా ఎంపీ వ్యవహరిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.