జగన్ ది ప్లాస్టిక్ నవ్వు

సిరా న్యూస్,విశాఖపట్నం;
వైసీపీ హాయంలో ఎక్సైజ్ శాఖ లో కోట్ల రూపాయల భారీ కుంభకోణం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి ఎక్సై జ్ డిపార్టుమెంట్నే లేపేసారని, ఆ డిపార్ట్మెంట్ లేకుండా చేసిన వ్యక్తి జగన్ అని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విమ ర్శించారు. మద్యంలో వైసీపీ నేతలు అడ్డంగా దోచుకున్నారని ఆరోపిం చారు. పూర్తి స్థాయిలో విచారణ చేస్తే… మిథున్ రెడ్డి అండ్ కో బాగో తాలు బయట పడతాయన్నారు. లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి, కసిరెడ్డి పాత్ర ఉందన్నారు. మద్యం షాపులో కూడా వైసీపీ నేతలు భారీగా దోచుకున్నారని, ఔట్ సౌర్స్ విభాగం ఏర్పాటు చేసి కొట్ల రూపా యలు కొల్లగట్టారని ధ్వజమెత్తారు. రాజ్ కసిరెడ్డి అనే బినామీని విచా రణ చేస్తే కొన్ని కోట్ల రూపాయల సొమ్ము బయట పడుతుందన్నారు. ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై మంత్రి కొల్లు రవీంద్రకు ఫిర్యాదు చేస్తానన్నారు.వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నవారు ఒక్క రు కూడా ఆ పార్టీలో లేరని, జగన్ ను నమ్ముకుని ఉన్న వాళ్ళ రోడ్డు పడ్డారని.. అందుకు తానే ఉదాహ రణ అని ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీని వాస్ అన్నారు. జగన్ మాటల్లో గుడ్ అనే పదం లేదని, మద్యపానం నిషేధం అమలు చేయలేదని.. పోల వరం కట్టలేదని.. ఇచ్చిన హామీలు అమలు చేయలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలోనే వ్యతిరే కత వచ్చిందా..జగన్ అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం పాలన అద్భుతంగా ఉందని.. బుద్ధి ఉండే మాట్లాడుతున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ది ప్లాస్టిక్ నవ్వు అని… అన్న జగన్పై వైఎస్ షర్మిల చెప్పినవన్నీ నిజాలే అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *