సిరా న్యూస్,జయశంకర్ భూపాలపల్లి;
జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో పర్యటించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి.దిలీప్ కుమార్,
డాక్టర్ యూ.నాగభూషణం , డాక్టర్ ఆర్.విశ్వతేజ మరియు జిల్లా వ్యవసాయ అధికారి శ విజయ్ భాస్కర్ వరి పొలాలను, ప్రత్తి చేనులను మరియు మిర్చి తోటలను బుధవారం సందర్శించారు.
ప్రత్తిలో రసం పీల్చు పురుగుల అధికంగా ఉన్నట్లు గుర్తించి, వాటి నివారణకు డాఫెంతయిరాన్ అనే మందును 1.25 గ్రాములు లేదా అసిఫేట్ 1.5 గ్రా లీటర్ నీరు చొప్పున కలిపి పిచికారి చేసుకుకోవాలని సూచించారు. అలాగే ప్రస్తుతం మిర్చి తోటలో తామర పురుగు గమనించి వీటి నివారణకు ఫిప్రోనీల్ 2 మిల్లి లేదా స్పినోసాడ్ 0.3 మిల్లి లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ వరి నూతన చిరుసంచి వంగడాలను రైతు పొల్లాలో పరీక్షించి వాటి పనితనాన్ని పరిశీలించారు. ఈ పర్యటనలో మండల వ్యవసాయ అధికారులు వాసుదేవ రెడ్డి, ఐలయ్య, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.