సిరాన్యూస్, జైనథ్
రైతులను ఇబ్బంది పాలు చేయొద్దు : జిల్లా అఖిల పక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి
* ఎమ్మార్వో శ్యాంసుందర్ కు వినతిపత్రం అందజేత
జిల్లాలోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తేమ శాతం నిబంధనలు లేకుండా పత్తిని కొనుగోలు చేయాలనే కోరుతూ సోయాబీన్ డబ్బులు త్వరగా రైతులకు పడేలా చూడాలని జిల్లా అఖిల పక్ష రైతు సంఘం నాయకులు బండి దత్తాత్రి డిమాండ్ చేశారు. ఇటివల అఖిల పక్ష రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించిన ప్రకారం మండల కేంద్రాల్లో తహసీల్దార్లకు నేతలు వినతిపత్రాలు అందచేశారు. పత్తి కొనుగోళ్లలో రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే జైనథ్ మండల కేంద్రంలో ఎమ్మార్వో శ్యాం సుందర్ కు వినతిపత్రం అందించారు. అనంతరం మార్కెట్ యార్డ్ లో సోయా కొనుగోళ్ళ ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా బండి దత్తత్రి మాట్లాడుతూ పత్తి మద్దతు ధర విషయంలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని అన్నారు. పెట్టుబడి ఖర్చులకు, మద్దతు ధరకు పొంతన ఉండడం లేదన్నారు. జిల్లలో భిన్నమైన వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకోకుండా దేశవ్యాప్తంగా ఒకే రకమైన తేమ నిబంధనలను విధించడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై ఈనెల పద్దేనిమిదిన నిర్వహించనున్న ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గోవర్ధన్, రోకళ్ళ రమేష్, బండి దత్తాత్రే, కొండ రమేష్, లోకారి పోశెట్టి, గణేష్ యాదవ్,లక్ష్మణ్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.