ABVP Madawar Harish Reddy: సెక్యూరిటీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మడావార్ హరీశ్ రెడ్డి

సిరాన్యూస్, బేల‌
సెక్యూరిటీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాలి : ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మడావార్ హరీశ్ రెడ్డి

ఏబీవీపీ నాయకులపై దాడి చేసిన సెక్యూరిటీ సిబ్బంది పై చర్యలు తీసుకోవాల‌ని ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మడావార్ హరీశ్ రెడ్డి అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో ఏబీవీపీ జిల్లా హాస్టల్ కన్వీనర్ మడావార్ హరీశ్ రెడ్డి మాట్లాడారు. బాసర టిపుల్ ఐటిలో విద్యార్ధి మరణం పై ప్రశ్నించడానికి వెళ్లిన ఏబీవీపీ నాయకులపై అక్కడున్న సెక్యూరిటీ సిబ్బంది దాడి చేయడం సిగ్గుచేటన్నారు.ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్యకు గల కారణాలేంటి నిజానిజాల కోసం ప్రభుత్వం ఎంక్వయిరీ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.వెంటనే ఆ కుటుంబానికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడతామణి హెచ్చరించారు.వెంటనే ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స‌మావేశంలో రేసు మనోజ్ రెడ్డి, నార్లవర్ అజయ్, పిన్నం శ్రీనివాస్, సచిన్,సుధం, బాలాజీ, అంకుల్, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *