సిరా న్యూస్,ఖమ్మం;
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ లో అడిషనల్ కలెక్టర్ శ్రీజ పర్యటించారు. పర్యటనలో భాగంగా సత్తుపల్లి పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిని అడిషనల్ కలెక్టర్ శ్రీజ తనిఖీ చేశారు.హాస్పిటల్ లోని పలు విభాగాలను సందర్శించి రికార్డ్ లను పరిశీలించారు.
రోగులకు మందులు ఇచ్చే ఫార్మసీ, ఒపి, పెసెంట్ డేటా ఎంట్రీ, ప్రసూతి వార్డ్, తదితర విభాగాలను పరిశీలించి సిబ్బందితో మాట్లాడారు.
వార్డులలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, ఆసుపత్రిలో అందుతున్న సేవలు సౌకర్యాలు, వైద్య సదుపాయాల అడిగి తెలుసుకున్నారు. అనంతరం నూతనంగా నిర్మించిన వంద పడకల ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు.