సిరాన్యూస్, చర్ల
ఆదివాసీల సొమ్ము దోచుకుంటే ఉద్యమిస్తాం : ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప రాజు
* ఆదివాసీ మహిళా సొసైటీ ఇసుక బిల్లులు తక్షణమే మంజూరు చేయాలి
ఇసుక బిల్లులు గిరిజన సొసైటి లకు చేయడం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోందని ఆదివాసిహక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు ప్రభుత్వం పైన మండిపడ్డారు. ఈ సందర్బంగా ఇరప రాజు మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,ములుగు జిల్లా,ఆదిలాబాద్ జిల్లాల్లో జరుగుతున్న ఇసుక క్వారీల ద్వారా ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు లబ్ది పొందుతూందని అన్నారు. కానీ గిరిజన ఇసుక సొసైటీ లకు మాత్రం రావాల్సిన బిల్లులు సకాలంలో ఇవ్వడం లేదన్నారు. 2022-23,2023-2024 నుండి ఇప్పటివరకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఇసుక ద్వారా డీడీ ల రూపంలో ప్రభుత్వానికి సమకూరిందాన్నారు. పెసా చట్టం ద్వారా ఏజెన్సీ లోని లఘు ఖనిజాల నిర్వహణ అధికారం గిరిజనులకు ఉందన్నారు. కానీ ప్రభుత్వాలు గిరిజన ఇసుక సొసైటీ లకు రావాల్సిన వందల కోట్ల రూపాయలను తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నట్లు పేర్కొన్నారు. గిరిజన సొసైటిల స్వయం ఉపాధిని ప్రభుత్వం దెబ్బతిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలను ఏర్పాటు చేసుకొని ఇసుకను ప్రభుత్వానికి అమ్మే క్రమంలో లేబర్ ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులు, ఇతర ఖర్చులన్ని గిరిజన సొసైటిల మీద పడి తెచ్చిన అప్పులకు వడ్డీలు ఎక్కువ అవుతున్నాయని చర్ల మండలంలో ఉన్న( సుబ్బంపేట 1,2,సి. కత్తిగూడెం, మోగళ్లపల్లి, కొత్తపల్లి, పెద్దిపల్లి, ఆర్ కొత్తగూడెం ) గిరిజన ఇసుక సొసైటి లు సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇసుక క్వారీల వల్ల ఆదివాసీలకు ఇప్పటి వరకు ఒరిగింది ఏమి లేదన్నారు. ప్రభుత్వం, రేజింగ్ కాంట్రాక్టర్లు లబ్ది పొండుతున్నారని అన్నారు. రావాల్సిన బిల్లులు సకాలంలో రాకపోవడం తో అనేక ఆర్ధిక సమస్యలు ఎదురు కుంటున్నట్లు ఆదివాసీలు వాపోతున్నారని తెలిపారు. టిజిఎంటిసి అధికారుల చుట్టూ ఎన్ని సార్లు తిరిగినా ఎటువంటి ప్రయోజనం ఉండడం లేదని ఆదివాసీలు తమ గోడు వెళ్ళబుచ్చు తూ ఉన్నారని ఆయన అన్నారు. గిరిజనులను ఆర్ధికంగా బలోపేతం చేయడానికి స్వయం ఉపాధి కలిగించడానికి ఇసుక క్వారీల నిర్వహణ అనుమతులు ఇచ్చినప్పటికి ఆ లక్ష్యం మాత్రం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నెరవేరడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంత ఖనిజ సంపదను అప్పనంగా తీసుకెళ్తూ ఆదివాసీల నోట్లో ప్రభుత్వం మట్టి కొడుతోందన్నారు. ఆదివాసీలు గత రెండు సంవత్సరాలనుండి బిల్లులు రాక దగా పడ్డారని, ఈ ప్రభుత్వం కూడా ఆ విధానాన్నే కొసగిస్తోందని పేర్కొన్నారు. ఇసుక ద్వారా వచ్చే సీనరేజి నిధులను స్థానిక సంస్థలకు కేటాయించాలన్నారు. డి ఎంఎఫ్ టి ద్వారా నిధులన్నీ నాన్ షెడ్యూల్డ్ ప్రాంతాల అభివృద్ధి కి కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇసుక ప్రభావిత ప్రాంతాల్లోనే ఆ నిధుల తో అభివృద్ధి చేయాలని అన్నారు. ఇసుక సొసైటీ లకు ఇచ్చే రేట్లు తక్కువ ఉన్నాయన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా సొసైటీ కి క్యూబిక్ మీటర్ కి 600 వందల రూపాయలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పనంగా అర్ధ రూపాయి ఆదివాసీల చేతులో పెట్టి కోట్ల రూపాయిలు ప్రభుత్వం దోచుకుంటున్నట్లు విమర్శిచారు. లోప భూయిష్ట విధానాలతో ఆదివాసీలను ఎప్పుడు ఆర్ధికంగా నిలబెడతారని నిలదీశారు. ఏళ్ల తరబడి ఉన్న బిల్లులను ప్రభుత్వం తక్షణమే మంజురు చేసి ఆదివాసీలను ఆదుకోవాలని కోరినారు. లేని పక్షంలో ఆదివాసీహక్కులపరిరక్షణవేదిక ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో ఆదివాసులు తో అన్ని సంఘాలను కలుపుకొని భవిష్యత్తు లో పోరాటం చేయనున్నట్లు పేర్కొంటున్నట్లు రాష్ట్ర కన్వీనర్ ఇరప. రాజు పత్రిక ప్రకటనలు ద్వారా తెలిపారు.