సిరా న్యూస్,హైదరాబాద్;
గణేష్ వేడుకల్లో నిర్వాహకులు రానురాను వింతపోకడలకు పాల్పడుతున్నారు. భక్తి శ్రద్ధలతో నిర్వహించాల్సిన వినాయక చవితి నవరాత్రి వేడుకలను కొందరు నిర్వాహకులు వింతగా నిర్వహిస్తున్నారు. తార్నాక లోని విజయపురి కాలనీ లో వినాయక మండప నిర్వాకులు అగోర వేషధారణలతో ఉన్న కొందరిని తీసుకొచ్చి పాములతో భయంకరంగా చేలాగాటలాడుతూ విన్యాసాలు చేశారు. సమాచారం అందుకున్న లాలాగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వేషదారులను అదుపులోకి తీసుకున్నారు.