సిరా న్యూస్,హైదరాబాద్;
వరుసగా సెలవులు ఉండడంతో ఉదయం నుండి ఖైరతాబాద్ సప్తముఖ మహా శక్తి గణపతి ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తు తరలివచ్చారు. శనివారం ఉదయం నుంచి రద్దీ పెరుగుతోంది. ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలలో భక్తుల జనసందోహంతో నిండిపోయింది. వచ్చిన భక్తులను పోలీసులు త్వరగా దర్శనం చేపించి ముందుకు కదిలిస్తున్నారు. ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా సిసి కెమెరా ద్వారా ప్రత్యేకంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఆకతాయిల నుండి మహిళకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకంగా షి టీమ్స్ ఏర్పాటు చేసారు. ట్రాఫిక్ కు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకమైన పార్కింగ్ ఏర్పాట్లు ట్రాఫిక్ పోలీస్ అధికారులు చేసారు. .