సిరా న్యూస్,అమరావతి;
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎటువంటి లాబీయింగ్ కు తావు లేకుండా మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిషాంత్ కుమార్ తెలిపారు.
రూ.99కే క్వార్టర్ బాటిల్ అందించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
ఈ నెల 11న లాటరీ ద్వారా షాపులు కేటాయిస్తామని, అలాగే 12వ తేదీ విజయదశమి నుంచి మద్యం దుకాణాలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.
బార్ల లైసెన్స్ 2025 ఆగస్టు వరకు ఉండటంతో వాటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.