సిరా న్యూస్,నిజామాబాద్;
త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికలు మూడు ప్రధాన పార్టీలకు సవాల్ గా మారనున్నాయి. ఇప్పటికే ఆశావాహులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే కాంగ్రెస్ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ అవకాశం ఇస్తుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఇక బిఆర్ఎస్,బిజెపి బలమైన అభ్యర్థులను బరిలో నిలుపేందుకు ప్లాన్ చేస్తున్నారు.. ఇండిపెండెంట్ అభ్యర్థులు మేము సైతం అంటున్నారు. మొత్తానికి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ ఎన్నికలు తలపించునున్నాయి..త్వరలో జరగబోయే గ్రాడ్యుయేట్ ఎన్నికల పై ప్రధాన పార్టీలు ఫోకస్ చేస్తున్నాయి. ఇప్పటికే ఆశావాహులు పోటి చేయడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుండడంతో.. ఆయా పార్టీల మద్దతుదారులకు ట్రై యాంగిల్ పైట్ నెలకోనే అవకాశం ఉంది. కొన్ని నెలల్లోనే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుంది. అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి టిక్కెట్ ఇస్తుందా లేదా అనేది మాత్రం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉండడం, గ్రాడ్యుయేట్ సెగ్మెంట్ పరిధిలో ఆ పార్టీకి సంబందించిన ఎమ్మెల్యేలుండడంతో కలిసి వస్తుందని ఆశావాహులు భావిస్తున్నారట. దీంతో టిక్కెట్ పై ఆశలు పెరుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ కొత్త వారికి అవకాశం ఇస్తుందా? లేదా జీవన్ రెడ్డికి ఛాన్స్ ఇస్తుందా అనేది స్సష్టత రావాల్సి ఉంది.గతంలో కంటే పార్టీ బలం పుంజుకోవడంతో ఈసారి బలమైన అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చి గెలుపించుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తోంది. ఈసారి బీజేపీలోను ఆశావాహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ప్రధానంగా సుగుణాకర్ రావు, రంజిత్ మోహన్, జగిత్యాల మాజి మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి, బాస సత్యనారాయణ తోపాటు ఆదిలాబాద్, మెదక్, నిజామాబాదు కు చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆశావాహులు పార్టీ టిక్కెట్ కోసం ఆశిస్తున్నారు. ఇక బీఆర్ఎస్ లోనూ ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవిందర్ సింగ్ ఇప్పటికే పోటిలో ఉన్నంటు ప్రచారం చేసుకుంటున్నారు. అదే విధంగా ప్రముఖ డాక్టర్ బీఎన్ రావు బీఆర్ఎస్ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారట. అయితే బీఆర్ఎస్ గెలిచే వారికి టిక్కెట్ ఇచ్చి.. వారికి సపోర్టుగా ముమ్మర ప్రచారం సాగించేలా ప్లాన్ చేస్తోందట.ప్రధాన పార్టీలు గెలుపు గుర్రాలను బరిలోకి నిలుపాలని ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తుంటే.. ప్రముఖ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీకి సై అంటున్నారట. అయితే.. జాతీయ పార్టీలు టికెట్ ఇస్తే బరిలోకి దిగుతానని స్పష్టం చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఈసారి రసవత్తరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగా.. ఇండిపెండెంట్ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశం ఉంది. మరి టిక్కెట్ ఇవ్వకపోతే సిట్టింగ్ ఎమ్మెల్సీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.ఉత్తర తెలంగాణలో ఈ ఎన్నికలు కీలకంగా మారనున్నాయి. ఇక్కడ మూడు పార్టీ లు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా మూడు పార్టీల కీలక నేతలకు సవాలుగా మారనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించగా. బీజేపీ ఎంపీ ఎన్నికల్లో ఈ ఎమ్మెల్సీ పరిధిలో నాలుగు ఎంపీ సీట్లు గెలిచి.. సత్తాను చాటింది. బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చినా.. ఎంపీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈ మూడు పార్టీలకు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి.