సిరా న్యూస్,నల్గోండ;
సోషల్ మీడియాలో తన వస్త్రాధారణపై, మీమ్ పేజెస్ లో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది..!! తనపై అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టిన ID లను గుర్తించి,వాటిపై మిర్యాలగూడ పోలిస్ స్టేషన్లో.. అమృత ఫిర్యాదు చేశారు…!! ఇది తెలిసిన కొంత మంది,తమ ID లోంచి ఆ పోస్ట్ లను వెంటనే డిలీట్ చేసారు..!! మిర్యాలగూడ కు చెందిన అమృత, అదే ఏరియాలో బాగా డబ్బు, పేరు ఉన్న మారుతీరావు కూతురు..!! అయితే చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచిన తన కూతురు, వేరే కులానికి చెందిన ప్రణయ్ అనే అబ్బాయిని ప్రేమించింది..ఈ విషయం తెలిసిన మారుతీరావు వాళ్ళ పెళ్ళికి అంగీకరించకపోవటంతో… అమృత ప్రణయ్ కులాంతర వివాహం చేసుకోవాల్సి వచ్చింది..! పరిస్థితుల్లో అమృత తన కుటుంబంతో విడిపోయి దూరంగా ఉంటూ,ప్రణయ్ వాళ్ళ ఇంట్లోనే ఉండేది..కొంత కాలం తర్వాత గర్భవతిగా ఉన్న అమృత హాస్పిటల్ కి చెకప్ కోసం వెళ్తుండగా.. హాస్పిటల్ సమీపంలో..ప్రణయ్ ని.. పదునైన కత్తితో వెనువెంటనే మెడ భాగంలో పోట్లు పొడిచారు..దానితో ప్రణయ్ అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలు విడిచాడు.. తర్వాత ఈ హత్య,తన తండ్రి మారుతీరావే చేయించానని పోలీసుల ముందు లొంగిపోయారు… ఏమైందో తెలియదు.. బెయిల్ మీద విడుదల అయిన తర్వాత ఆత్మహత్య చేసుకుని చనిపోయారు..!! . ఎవరి అజెండా వారిదే అప్పట్లో…ఇదొక పెద్ద ఉద్రిక్తతకు దారితీసింది.. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా స్పందించి,పరామర్శకి వచ్చి, డబుల్ బెడ్రూం ఇళ్లు, మరియు గవర్నమెంట్ ఉద్యోగం ప్రకటించారు ..!! సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటూ… అప్పటి నుంచి కొంత కాలం సోషల్ మీడియా కు దూరంగా ఉంటూ వస్తున్న అమృత,ఈ మధ్య రెగ్యులర్గా ఆక్టివ్ గా ఉంటూ…తన ఫ్యామిలీ, లైఫ్ స్టైల్ గురించి అప్డేట్స్ ఇస్తుంది..!! అయితే…ఇది నచ్చని కొందరు… ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉండేవారు..కానీ.. నిన్న తను ఈ విషయం సీరియస్ గా తీసుకుని పోలిసులకు కంప్లైంట్ ఇచ్చింది..!!