సిరాన్యూస్, బోథ్
షేక్ ఉస్మాన్ కుటుంబాన్ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల గ్రామానికి చెందిన షేక్ ఉస్మాన్ తండ్రి అల్లబకష్ ఇటీవల మృతి చెందారు.ఈవిషయం కార్యకర్తల ద్వారా తెలుసుకున్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ బుధవారం వారి నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వీరి వెంట సోనాల మాజీ సర్పంచ్ చెట్లపెల్లి సదానందం, రామయి శంకర్, శ్రీధర్ రెడ్డి, యాల్ల సుధీర్ రెడ్డి, బాసెట్టి రవి, చిలుకూరి నరేందర్, శ్రీనివాస్, సంతోష్ తదితరులు ఉన్నారు.