సిరా న్యూస్,అమరావతి;
వాయుగుండం తీరం దాటింది. గురువారం తెల్లవారుజామున సుమారు 4:30 సమయంలో తీరం దాటింది. చెన్నైకి దగ్గరగా పుదుచ్చేరి-నెల్లూరు మధ్య తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం క్రమంగా బలహీనపడింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ అల్పపీడనంగా బలహీనపడింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షాలు కురిసే అవకాశం వుంది. తీరం దాటినప్పటికి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.