సిరా న్యూస్,పిడుగురాళ్ల;
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా శుక్రవారం పిడుగురాళ్ల పట్టణంలోని వాసవి సేవాసమితి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు మరియు మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వాసవి సేవాసమితి జిల్లా కోశాధికారి జీవీఎన్ మునేశ్వరావు, ఫౌండర్ కొత్త వెంకట చలపతిరావు, సహాయ కార్యదర్శి కొప్పరపు శివయ్య, కోశాధికారి కొలిపాకుల కృష్ణ, ఉపాధ్యక్షులు కట్టమూరి నాగేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు చందోల శివ కృష్ణారావు, శ్రీ వాసవి అమ్మవారి దేవస్థానం మాజీ అధ్యక్షులు జూలకంటి సుబ్రహ్మణ్యం, పుర ప్రముఖులు కొత్త లక్ష్మీనారాయణ, లఘువరపు సింగరయ్య తదితరులు పాల్గొన్నారు.