పట్టణ టిడిపి అధికార ప్రతినిధి మంద డేవిడ్ రాజు వెల్లడి
సిరా న్యూస్,పిడుగురాళ్ల;
ఉదయం 5 గంటలకు పిడుగురాళ్ల పట్టణంలోని పాత మాదిగ పల్లె 17, 18 వార్డులలో గురజాల శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావు ఆదేశాల ప్రకారం నవంబర్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా ఇంటి ఇంటికి పింఛన్ల కార్యక్రమం నిర్వహించడం జరిగిందని పిడుగురాళ్ల పట్టణ టిడిపి అధికార ప్రతినిధి మంద డేవిడ్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ ఆఫీసు సిబ్బంది, పదవ సచివాలయం పింఛన్ల పంపిణీకి సంబంధించిన అడ్మిన్ తేజ, సిబ్బంది మరియు17, 18 వార్డుల కు సంబంధించిన వార్డు ఇన్చార్జులు, బూత్ ఇన్చార్జులు బూత్ కన్వీనర్లు, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.