ASP Ankit Kumar: నలుగురు మావోయిస్టు సభ్యులు అరెస్ట్ : ఏఎస్పీ అంకిత్ కుమార్

సిరాన్యూస్‌,చర్ల
నలుగురు మావోయిస్టు సభ్యులు అరెస్ట్ : ఏఎస్పీ అంకిత్ కుమార్

నలుగురు మావోయిస్టు సభ్యులను అరెస్ట్ చేసిన‌ట్లు ఏఎస్పీ అంకిత్ కుమార్ తెలిపారు. వివ‌రాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల పోలీస్ స్టేషన్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిఆర్పిఎఫ్ సిబ్బందితో చర్ల మండలం చింతగుప్ప, బోధ నెల్లి అటవీ ప్రాంతంలో ఏరియా డామినేషన్ చేస్తుండగా చింతగుప్ప అటవీ ప్రాంతంలో నలుగురు మావోయిస్టు పార్టీకి చెందిన మిలీసియా సభ్యులను అదుపులోనికి తీసుకున్నారు.1 పొడియం సమ్మయ్య, జారపల్లి గ్రామం, చత్తీస్గడ్ రాష్ట్రం కమిటీ సభ్యుడు, 2 గట్టుపల్లి రమేష్, జార పల్లి గ్రామం, చత్తీస్గడ్ రాష్ట్రం, కమిటీ సభ్యుడు.3 పూనమ్ రూపేష్, నిమ్మలగూడెం గ్రామం, చత్తీస్గడ్ రాష్ట్రం మలేషియా సభ్యుడు.4 వేడమ శ్రీను నిమ్మలగూడెం గ్రామం,, చత్తీస్గడ్ రాష్ట్రం, మలేషియా సభ్యుడు. వీరి వద్దనుండి డీసీఎం వ్యాన్, రెండు ట్రాక్టర్లు, రెండు మోటార్ సైకిల్స్, రెండు కార్డెక్స్ వైర్ బండిల్స్, రెండు పడవలు స్వాధీనపరుచుకున్నారు. స్వాధీన పరుచుకున్న పడవలు, కార్డెక్స్ వైర్బండిల్స్ ను నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన బెటాలియన్ కు, సౌత్ బస్టర్ డివిసికి, తెలంగాణ స్టేట్ కమిటీ మావోయిస్టు పార్టీకి తీసుకు వెళుతున్నట్లు మలేషియా సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా ఏఎస్పీ అంకిత్ కుమార్ మాట్లాడుతూ అజ్ఞాతంగా నిషేధిత మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సభ్యులు, నాయకులు స్వచ్ఛందంగా, తమంతట తాముగా జనజీవన స్రవంతిలో కలవాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తుంద‌ని తెలిపారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి ప్రత్యక్షంగా గాని , పరోక్షంగా గాని సహకరిస్తూ ,చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయక ఆదివాసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకునే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *