వైద్యుల నిర్లక్ష్యంతో 3నెలల బాబు మృతి చెందాడని తల్లిదండ్రుల ఆరోపణ
తల్లిదండ్రులకు తెలియకుండా పోలీసుల సహాయం తో బాబు బాడీ ఉస్మానియా మార్చురికి తరలింపు
సిరా న్యూస్,హైదరాబాద్;
మలక్ పేట సేఫ్ పిల్లల హాస్పిటల్ లో దారుణం జరిగింది.వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ 3నెలల బాబు మృతి చెందాడని తల్లిదండ్రుల ఆరోపించారు.మహబూబ్ నగర్ జిల్లా అక్కారం గ్రామం కు చెందిన కేతావత్ హనుమంత్ తమ 3నెలల బాబు నిమోనియా తో అస్వస్థతకు గురి కావడంతో అక్టోబర్ 9వ తేదీ మలక్ పేట లోని సేఫ్ చిల్డర్న్స్ హాస్పిటల్ కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నారు. మూడు రోజుల నుంచి ఐసియూ లో ఉంచిన సేఫ్ హాస్పిటల్ వైద్యులు బాబు ఆరోగ్యం మెరుగైందని నిన్నటి రోజు జనరల్ వార్డుకు మార్చరని, ఈ రోజు సాయంత్రం డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారని,ఇంతలోనే మధ్యాహ్నం నర్స్ వచ్చి ఇంజెక్షన్ వేసిన 10 నిమిషాలకే బాబు మృతి చెందాడని తండ్రి హనుమంత్ ఆరోపించారు.
బాబు చనిపోయిన కొద్ది సేపటిలోనే పోలీసులు చేరుకుని బాబు బాడీ ఉస్మానియా మార్చురీకి తరలించడం జరిగిందని,తమ బాబును తమకు ఇవ్వాలని హాస్పిటల్ ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు.
హాస్పిటల్ సీజ్ చేసి,వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.