సిరా న్యూస్,బద్వేలు;
బద్వేల్ గోపవరం మండలం సెంచరీ ప్లైవుడ్ కంపినీ కి సమీపాన అటవీ ప్రాంతానికి దగ్గరలో మైనర్ బాలిక ఒంటిపై మంటలతొ కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, స్థానికుల సహాయంతో బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి బాలికను తరలింపు…అయితే బాలిక ఆత్మహత్య ప్రయత్నమా లేక మరెవరైనా పెట్రోల్ పోసి నిప్పు అంటించారా అన్నది తెలియాల్సి ఉంది…..బాలిక దస్తగిరమ్మ బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది..
బద్వేల్ పట్టణ సిద్ధవటం రోడ్డు రామాంజనేయ నగర్లొ దస్తగిరమ్మ కుటుంబం జీవిస్తుంది….ఈ ఘటన లో అదేవీదికి చెందిన విగ్నేష్ అనే యువకుడి పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాలిక తల్లిదండ్రులు..విగ్నేష్ కు గతంలో ప్రేమ వివాహం జరిగి భార్య గర్భవతి అని తెలుస్తుంది..విగ్నేష్ కోసం కేసు నమోదు చేసి పోలీస్ గాలిస్తున్నారు…..