సిరాన్యూస్,జైనథ్
కాప్రిలో ఘనంగా బతుకమ్మ నిమజ్జనం వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని కాప్రి గ్రామంలో శనివారం మహిళలు బతుకమ్మలను ఘనంగా నిమజ్జనం చేశారు. ఈసందర్భంగా మహిళలు అందంగా అత్యంత ఇష్టపడే బతుకమ్మ పండుగను ప్రతీ రోజు మహిళలు ఎంతో ఆనందంగా ఆట, పాటలతో ఆడి పాడారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు టద్దం బతుకమ్మ అని తెలిపారు. శనివారం బతుకమ్మలను డప్పు చప్పుల్ల నడుమ పోయి రా గౌరమ్మ మల్లి గౌరమ్మ అంటు పాటలు పాడుతూ గ్రామంలో గల పెద్ద వాగులో ఘనంగా నిమజ్జనం చేశారు.