సిరా న్యూస్,సికింద్రాబాద్..;
సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయాన్ని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ దర్శించుకున్నారు. రాజా సింగ్ మాట్లాడుతూ ఇటీవల హిందూ సంఘాల నాయకులు కార్యకర్తలపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలి. 👉నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముత్యాలమ్మ ఆలయం పై జరిగిన దాడి విషయంలో మాట్లాడిన తీరు సరికాదు. భావోద్వేగాలను రెచ్చగొట్టాల్సిన అవసరం ఎవరికీ లేదు హిందూ మనోభావాలు దెబ్బతీసే వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే బాగుంటుందని అన్నారు.
అన్ని పార్టీల నేతలకు ఆలయంలోకి అనుమతి ఉన్నప్పటికీ రాజాసింగ్ ను అక్రమంగా గృహ నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసం. ఆలయం పైన దాడి చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆలయాల పైన దాడి చేయడం అనేది హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే. మన దేవాలయాలను మనమే కాపాడుకోవాలి. ముత్యాలమ్మ దేవాలయంలో సీసీ కెమెరా ఉన్నందుననే నిందితుడుని గుర్తించగలిగాం. హిందూ సంఘాల ప్రతినిధులను అరెస్టు చేయడం వారిపై లాఠీచార్జి చేయడం బాధాకరమని అన్నారు.