సిరా న్యూస్,మంథని;
మంథని పట్టణ కేంద్రంలో బుధవారం శ్రీ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలను నిర్వహించారు. ప్రతి సంవత్సరం నిర్వహించినట్టుగానే ఈ సంవత్సరం కూడా ఆరట్టు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
అయ్యప్ప స్వామి ఆలయంలోని అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహాన్ని మంథని పట్టణంలోని గోదావరి నదికి ఊరేగింపుగా తీసుకెళ్లి గురుస్వామి భద్రయ్య, ఆలయ అర్చకులు నాగేశ్వర శర్మ ఆధ్వర్యంలో చక్రస్నానం నిర్వహించారు. అనంతరం మందిరం నుంచి అయ్యప్ప స్వామిని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో అయ్యప్ప స్వామి దీక్ష పరులు ఊరేగించారు. అయ్యప్ప నామస్మరణతో ప్రధాన వీధుల గుండా అయ్యప్ప స్వామి ఆలయం వరకు అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప దీక్షపరులు భక్తి భావంతో నృత్యాలు చేశారు. అనంతరం అయ్యప్ప ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష పరులకు బిక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయంత్రం పడి పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు ఓడ్నాల శ్రీనివాస్, కార్యదర్శి నూకల శంకర్, కోశాధికారి కొంతం రమేష్,
కార్యవర్గ సభ్యులు వెంగళదాసు ఐలయ్య, గుండా రాజు, ఎమ్మెస్ రెడ్డి అయ్యప్ప దీక్షపరులు కంది కృష్ణారెడ్డి లతోపాటు అయ్యప్ప దీక్ష పరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.