సిరా న్యూస్,పెద్దపల్లి;
: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తక్షణమే అమలు చేయాలని బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నోమూరి శ్రీధర్ ఆద్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా నోమూరి శ్రీధర్ మాట్లాడుతూ తక్షణమే కులగణన చేపట్టి స్ధానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి విద్యార్థి సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మల్యాల సంజీవ్ గౌడ్, జాతీయ బీసీ యువజన సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నొమూరి శ్రీధర్, అలువాల రాజేందర్, రంగు రాజేశం, నారగోని శివకుమార్ గౌడ్, వేల్పుల నాగసూర్య, మేకల సాయి ప్రణయ్, కొక్కుల అభినయ్, దాసరి శ్రీనివాస్, అడ్డగుంట అభిలాష్, తదితరులు పాల్గొన్నారు.