-మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమా
-స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో విద్యార్థులచే ప్రతిజ్ఞ
సిరా న్యూస్,మంథని;
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉందని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమాసురేష్ రెడ్డి అన్నారు. శనివారం మంథని పట్టణంలోని కాకతీయ పాఠశాల విద్యార్థులతో మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమాసురేష్ రెడ్డి అధ్యక్షతన మున్సిపల్ సూపర్డెంట్ ఎన్ మనోహర్ స్వచ్ఛత ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా చైర్ పర్సన్ రమాసురేష్ రెడ్డి మాట్లాడుతూ పరిశుద్ధమైన, ఆరోగ్యవంతమైన భారత్ ను ఆవిష్కరించాలన్న మహాత్మా గాంధీ కలను నిజం చేసి చూపించాలని, ప్రజల్లో ప్రతి ఒక్కరూ చెత్తను వీధుల్లో వేయకుండా జాగ్రత్త పడడమే కాకుండా ఇతరులు కూడా చెత్త వేయకుండా చూడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమములో కౌన్సిలర్లు వికే రవి, గుండా విజయలక్ష్మి పాపారావు, కాకతీయ స్కూల్ ప్రిన్సిపల్ ప్రదీప్ రెడ్డి లతో పాటు పాఠశాల సిబ్బంది విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.