బెట్టింగ్ యాప్ గుట్టు రట్టు

సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో బెట్టింగ్ యాప్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఏడుగురు నిందితులను అదుపు లోకి తీసుకున్నారు.ఇందుకు సం బంధించి వివరాలను సీపీ శంఖబ్రత బాగ్చీ వెల్లడించారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన సమాచారంతో విశా ఖ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్ప డుతున్న ముఠాను పట్టుకున్నట్లు తెలిపారు. వీరికి చైనాతో సంబం ధాలున్నాయని చెప్పారు. రకరకాల పేర్లతో బెట్టింగ్ యాప్లు నిర్వహి స్తున్నారని శంఖబ్రత బాగ్చీ వివ రించారు.ఆర్బీఐ అనుమతి లేకుం డా ఈ ముఠా యాప్ నిర్వహిస్తోం దని శంఖబ్రత బాగ్చీ పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్ సొమ్మును చైనా, తైవాన్కు పంపుతున్నట్టు ద్యర్యా ప్తులో గుర్తించామని అన్నారు. నిందితుల నుంచి 8 డెస్క్టాప్లు, 10 ల్యాప్టాప్లు, కారు, బైక్, 800 చెక్బుక్లు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు వీరు ఏ విధమైన చిరునామాలు లేకుండా సిమ్కార్డులు సంపాదించి వాటి ద్వారా ఈ నేరానికి పాల్పడుతు న్నట్లు వెల్లడించారు. ఇటువంటి యాప్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంఖబ్రత బాగ్చీ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *