సిరా న్యూస్,విజయవాడ;
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. విజయవాడ నుంచి తెనాలికి ఆమె ఇవాళ ఆర్టీసీ బస్సులో వెళ్లారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో తెనాలి వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కిన షర్మిల.. మధ్యలో ప్రయాణికులతో మాట్లా డారు. వారి కష్టాల్ని అడిగి తెలుసు కున్నారు.కూటమి ప్రభుత్వం ఇచ్చి న ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కాకపోవడంపై వారు ఏమ నుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. హామీ అమలు కోసం వారు ఎదురుచూస్తున్నట్లు ఆమెకు చెప్పారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం హామీ కోసం గట్టిగా అడగాలని షర్మిల మహిళా ప్రయాణికులకు సూచించారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా వెంటనే ఈ హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.