సిరా న్యూస్,గద్వాల:
రైలు కిందపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు వీర శేఖర్ మృతి చెందిన ఘనటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. జిల్లా కేంద్రంలోని నల్లకుంట వీధికి చెందిన శేఖర్ ప్రభుత్వ టీచర్. కాగా15రోజులుగా మానసికంగా ఇబ్బందిపడున్నాడన్నారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం రైల్వే పట్టాలపైకి వెళ్లి రైలు కిందపడి మృతి చెందాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గద్వాల ఆరెకటిక సంఘం కోశాధికారి సుకున్ కార్ వీరశేఖర్(51)ఏళ్ల తాను ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా, ఆరె కటిక సంఘం శ్రేయస్సను కోరుకొనే వ్యక్తిగా గద్వాల పట్టణంలో సుపరిచితులు.చిన్నతనం నుంచి నీతి, నిజాయితిని నమ్ముకున్న వ్యక్తి. కష్టపడి అతి పిన్న వయస్సులో ఉద్యోగ జీవితాన్ని అందుకున్న కృషివలుడు. మృదు స్వవాభిగా కుటుంబంలో, కుల బందువులలో ప్రేమాభిమానాలు పంచిన ప్రాణిగా మా అందరి హృదయాల్లో వీరశేఖర్ ఉన్నారు.. సంఘంలో తొలి తరం ఉపాధ్యాయుడిగా పేరుపొందిన ఎస్ కె తిప్పాజీరావు పెద్ద కుమారుడైన వీరశేఖర్ దుర్మరణం దిగ్బ్రాంతిని కలిగిస్తున్నది. తల్లి, భార్య, సోదరుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.