మూసీ ప్రక్షాళకు రైతులు ఉద్యమించాలి

సిరా న్యూస్,నల్లగొండ;
మూసీ ప్రక్షాళనపై బీఆర్ఎస్, బీజేపీ పార్టీల తీరును శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎండగట్టారు. -రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూసీ ప్రక్షాళన ప్రాజెక్ట్ స్వాగతిస్తున్నాను. వాజ్ పాయ్ ప్రభుత్వం హయాంలోనే నదుల ప్రక్షాళన కు అడుగు పడింది. కేసిఆర్ సైతం రివర్ ఫ్రంట్ పేరుతో ప్రణాళిక తీసుక వచ్చారు. గత ప్రభుత్వాలు కేవలం మాటలకే పరిమితం అయ్యాయి. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజల కోసం నందనవనంలో గతంలోనే వేయికి పైగా ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొత్తగా ఏదో చేస్తున్నట్టు వ్యతిరేక ప్రచారం చేయడం కరెక్ట్ కాదని అన్నారు. యాదాద్రి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. మాజీ మంత్రి కేటీఆర్ తెలివిగా మాట్లాడుతున్నారు. ఆయన వైఖరి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన హయాంలో ఇష్టం వచ్చినట్టుగా భారీ అంతస్తులకు అనుమతులు ఇచ్చారు. డ్రైనేజ్, నాలాల వ్యవస్థలు గాలికి వదిలి వేశారు. మనం చేస్తే సుందరీకరణ.. అవతలి వారు చేస్తే వేరేదా..? ప్రత్యేక బోర్డు పెట్టి చైర్మెన్ ను కూడా పెట్టింది మీరే కదా. వాజ్ పాయ్ హయాం లో నదుల ప్రక్షాళన ఈటెల రాజేందర్ కు తెలియదా? ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు ప్రతిపక్షాల తీరును ఎండగట్టాలి. అవసరం అయితే మూసీ ప్రక్షాళన కోసం ఉద్యమానికి దిగాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *