అమర్నాథ్ తస్మాత్ జాగ్రత్త

గండి బాబ్జి

సిరా న్యూస్;
సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన పై మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ మాటలను ఖండిస్తూ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జి మాట్లాడారు.
సచివాలయంలో ఐటీ మంత్రి ఛాంబర్ లో నీరు కారుతుందని చెబుతున్న మాజీ మంత్రి ఎందుకు బాగుచేసుకోలేకపోయారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులు సచివాలయంకు వెళ్ళారా అని ప్రశ్నించారు. స్టార్ హోటల్స్ లో సమావేశాలు నిర్వహించి ప్రజా ధనాన్ని వైసీపీ మంత్రులు వృధా చేశారు. ప్రజా ధనాన్ని ఖర్చు చేసి ఋషికొండ లో భవనాలు ఎందుకు కట్టారో ఎవరికి అర్ధం కావడం లేదు.చంద్రబాబు ప్రజలు కోసం కట్టిన ప్రజా వేదికను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చేశారు. జగన్ 11 లక్షల కోట్లు అప్పులు చేశారు.అమర్నాధ్ మంత్రి గా ఉండి ఎన్ని పరిశ్రమలు తెచ్చారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారువిజయసాయిరెడ్డి ని వేసుకొని మరల ఉత్తరాంద్ర లో పెత్తనం చేలాయించాలని చూస్తున్నారు.వైసీపీ ని వదిలి అనేక మంది బయటకు వస్తున్నారు. అమర్నాధ్ కు రాజకీయ భిక్ష పెట్టింది చంద్రబాబు నాయుడు.అమర్నాధ్ మంత్రిగా ఉన్న సమయంలో ఎంత దోచుకున్నారో అందరికి తెలుసు. మాజీ మంత్రి అమర్నాధ్ కు బెంగుళూరులో ఉన్న భవనాలు ద్వారా నెలకు కోటి రూపాయిలు అద్దె రూపంలో వస్తుంది అని చెప్పారు.అమర్నాధ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి లేదంటే ప్రజలే బుద్ధి చెబుతారు తస్మాత్ జాగ్రత్త అని అన్నారురాష్ట్ర ప్రజలు వైసీపీ ని 11 సీట్లుకె పరిమితం చేసిన నాయకులకు బుద్ధి రావడం లేదు అని ఎద్దేవా చేశారుజగన్ గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. వైసీపీ ప్రభుత్వ హయం లో అనేక దొంగ జీఓ లు ఇచ్చారు వాటన్నిటినీ సీఎం చంద్రబాబు బయటకు తీస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ని విమర్శించే స్థాయి అమర్నాధ్ కు లేదు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టీల్ ప్లాంట్ కోసం ఏమి చేశారు. విశాఖ ఉక్కు కోసం ఒక్కసారి అయిన కేంద్రం తో మాట్లాడారా అని ప్రశ్నించారురైల్వే జోన్ కు భూమి ఇస్తే ఎందుకు కార్యాలయానికి శంకుస్థాపన చేయించలేకపోయారు.
విశాఖ ఉక్కు పరిశ్రమ సమస్య పరిష్కరం చేయాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు అని ఉద్ఘాటించారు ఒకటివ తేదీకి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాము.
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ ని వీడడానికి సిద్ధంగా ఉన్నారు ఆఖరికి ఆ పార్టీ లో జగన్ ఒక్కడే మిగిలిపోతాడు అని పేర్కొన్నారు. సమావేశంలో కార్పొరేటర్లు గొలగాని వీరా రావు, వురుకూటి నారాయణ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *