సిరా న్యూస్,కోరుట్ల;
ప్రముఖ వ్యాపారవేత్త, పరిశ్రమల అధినేత, దివంగత రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘ నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం జగిత్యాల జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తాలో దివంగత నేత రతన్ టాటా కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సంఘ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రతన్ టాటా దేశానికి ఎన్నో సేవలు అందించారన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి రతన్ టాటా అని తెలిపారు. ఆయన వ్యాపార, పరిశ్రమలలో వచ్చే లాభాలను ప్రజా అవసరాలకు అందించే వారిని అన్నారు. ఆయన వివిధ స్వచ్ఛంద సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు అందించారన్నారు. ప్రతి వంద రూపాయల్లో 65 రూపాయలు వివిధ సంక్షేమాల కోసం అందించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఆయన ప్రజా సేవ కోసమే తపించేవాడని ప్రజలకు కావలసిన విద్య ,వైద్యం, గ్రామ అభివృద్ధి కోసం నిధులు ఇచ్చే వారన్నారు. అలాంటి మహా మనిషికి కేంద్ర ప్రభుత్వం వెంటనే భారతరత్న ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు ఉయ్యాల నరసయ్య, బలిజ రాజారెడ్డి , డివిజన్ అధ్యక్షుడు ఉయ్యాల శోభన్, గురు మంతుల నారాయణ, సామల వేణుగోపాల్, ఎడ్ల ప్రభాకర్, దామ శ్రావణ్, జాగిలం శంకర్, సామల దశరథం తదితరులు పాల్గొన్నారు.