బజరంగ్ దళ్ అందోళన
సిరా న్యూస్,నరసాపురం;
పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లో భవాని మాల ధరించి స్కూలుకు వచ్చిన విద్యార్థిని రాయపేట ప్రాంతంలోని జె సికిలే స్కూల్ యజమాన్యం యూనిట్ పరీక్షలకు లోనికి అనుమతించకపోవడంతో స్కూలు వద్ద బజరంగ్ దళ్ విద్యార్థి బంధువులు ధర్నాకు దిగారు. తక్షణం విద్యార్థిని పరీక్షకు అనుమతించాలని ఆందోళన చేయటంతో స్కూల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరికి యజమాన్యం విద్యార్థి బంధువులకు క్షమాపణ చెప్పి విద్యార్థిని పరీక్షకు అనుమతించడంతో బజరంగ్ దళ్ సభ్యులు విద్యార్థి బంధువులు ఆందోళన విరమించారు…