BJP Allu Prasad: స‌భ్య‌త్వ న‌మోదు చేయండి : బీజేపీ పట్టణ అధ్యక్షుడు అల్లు ప్రసాద్

సిరాన్యూస్, సామర్లకోట
స‌భ్య‌త్వ న‌మోదు చేయండి : బీజేపీ పట్టణ అధ్యక్షుడు అల్లు ప్రసాద్

బీజేపీ నాయకులు, కార్యకర్తలకు 100 సభ్యత్వ నమోదుకు మరో అవకాశం కల్పించింద‌ని బీజేపీ పార్టీ పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు అల్లు ప్రసాద్ అన్నారు. బుధ‌వారం ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు అల్లు ప్రసాద్ మాట్లాడారు. ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి వచ్చే సాధారణ సభ్యత్వ నమోదు మంగళవారం ముగియడంతో,100 సభ్యత్వాల నమోదుకు దగ్గరగా ఉన్న పార్టీ కార్యకర్తలకు, నాయకులకు భారతీయ జనతా పార్టీ మరో అవకాశాన్ని కల్పించింద‌ని తెలిపారు. ఈనెల‌20 వ తేది నుండి భారతీయ జనతా పార్టీ క్రియాశీల సభ్యత్వాలు నమోదుకు పార్టీ అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని తెలిపారు. స‌మావేశంలో పార్టీ కార్యకర్తలు, ,నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *