సిరాన్యూస్, సామర్లకోట
ఓటరు నమోదు చేసుకోండి : బీజేపీ మండల అధ్యక్షుడు అల్లు ప్రసాద్
పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటర్లగా నమోదు చేసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు అల్లు ప్రసాద్ అన్నారు. ఏపీలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల 6న ముగియనుందని తెలిపారు. అర్హులైన గ్రాడ్యుయేట్లు ఏపీ సీఈవో వెబ్ సైట్లో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు తెలిపారు.లేదంటే ఫారం-18 నింపి, గెజిటెడ్ అధికారి సంతకం చేయించి ,దీంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, పదో తరగతి సర్టిఫికేట్, ఓటర్ ఐడీ జిరాక్స్ లను జత చేయాలని పేర్కొన్నారు. అన్ని కలెక్టరేట్‌లలో, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ తో పాటు సబ్ కలెక్టర్, ఆర్డీఓ, తహశీల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్, ఎంఈవో ఆఫీసులలో దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు.ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క గ్రాడ్యూయేట్ ఉపయోగించుకోవాలని కోరారు.