తెలంగాణలో 24 లక్షలకు చేరుకున్న బీజేపీ సభ్యత్వాలు

సిరా న్యూస్,హైదరాబాద్;
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ, రాష్ట్ర మెంబర్ షిప్ ఇంచార్జ్ శ్రీ ఎన్. రాంచందర్ రావు మాట్లాడారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. సెప్టెంబరు 2వ తేదీన మొదలైన మెంబర్ షిప్ కార్యక్రమం అక్టోబర్ 15 చివరి తేదీగా కేంద్ర పార్టీ ప్రకటించినప్పటికీ.. వివిధ కారణాలతో తేదీని పొడిగించడం జరిగింది. దేశంలో మహారాష్ట్ర, జార్ఖండ్ తో పాటు ఉప ఎన్నికల దృష్ట్యా అక్టోబరు 30 వరకు బిజెపి మెంబర్ షిప్ అభియాన్ కార్యక్రమాన్ని పొడిగించడం జరిగిందని అన్నారు. గత కొన్ని రోజులుగా బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా జరుగుతున్నది. నిన్న ఒక్కరోజే లక్షా 30 వేల సభ్యత్వాలు నమోదయ్యాయి. సెప్టెంబరు 25 దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున లక్షా 35 వేల మెంబర్ షిప్ జరిగింది. ప్రతి రోజు సుమారు 45 వేల చొప్పున మెంబర్ షిప్ జరుగుతోంది. అక్టోబరు 30వ తేదీ వరకు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. 88 0000 2024 నంబర్ కు మిస్ట్ కాల్డ్ ద్వారా లింక్ లోకి వెళ్లి రిఫరల్ కోడ్ ఎంటర్ చేసి వ్యక్తిగత వివరాలతో పాటు ఫోన్ నెంబర్ కు దృవీకరించాలి. మిస్డ్ కాల్ ద్వారా నిన్నటి వరకు సుమారు 4 లక్షల వరకు సభ్యత్వాల నమోదు, ఆన్ లైన్ ద్వారా 20 లక్షల వరకు మెంబర్ షిప్ జరిగిందని అన్నారు.
మొత్తంగా తెలంగాణలో నేటి వరకు 24 లక్షల వరకు బిజెపి సభ్యత్వ నమోదు జరిగింది. సుమారు 100 మెంబర్ షిప్ పైగా చేసిన వారే యాక్టివ్ మెంబర్ షిప్ జాబితాలో చేరుతారు. అక్టోబర్ 17 వ తేదీ వరకు 9 వేల మంది యాక్టివ్ మెంబర్ షిప్ గా చేరారు. తెలంగాణ వ్యాప్తంగా యాక్టివ్ మెంబర్ షిప్ లక్ష్యాన్ని 40 వేల మందిగా నిర్దేశించుకున్నాం. వివిధ బూత్ కమిటీల్లో యాక్టివ్ మెంబర్ షిప్ గా ఉన్నవారే సంస్థాగతమైన పదవులకు అర్హులు. కేవలం బిజెపిలో మాత్రమే అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పద్ధితిలోనే సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంది. సంఘటన్ పర్వ్ కు జాతీయ స్థాయిలో రిటర్నింగ్ ఆఫీసర్ గా డాక్టర్ కె.లక్ష్మణ్ ని పార్టీ నియమించింది. తెలంగాణ రాష్ట్రంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మీనారాయణ, కో-రిటర్నింగ్ ఆఫీసర్లుగా కరుణాకర్, , మాజీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి ని నియమించారిన అన్నారు.
అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ, సమన్వయం చేసుకుంటూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. బిజెపి ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి క్యాంపులు నిర్వహించి 50 వేల సభ్యత్వాలు స్వీకరించింది. మహిళా మోర్చా ఆధ్వర్యంలో 500కి పైగా క్యాంపులు, యువజన మోర్చా, ఓబీసీ మోర్చా, మైనారిటీ మోర్చా, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో మెంబర్ షిప్ ఎన్ రోల్ మెంట్ కోసం క్యాంపులు నిర్వహిస్తున్నాం. యువకులు, మహిళలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజల నుంచి సభ్యత్వాలు స్వీకరిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతాల్లోనూ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అన్ని చోట్ల ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. భారతీయ జనతా పార్టీలో చేరండి. తెలంగాణలో అతిపెద్ద పార్టీగా బిజెపి ఆవిర్భవించేలా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతున్నాం. రాష్ట్రంలో గతంలో ఏ రాజకీయ పార్టీకి 30 లక్షలకు మించి మెంబర్ షిప్ జరగలేదు. ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లి అన్ని వర్గాల నుంచి సభ్యత్వాలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు,
ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి, పార్టీ మెంబర్ షిప్ స్టేట్ కో-కన్వీనర్లు కొల్లి మాధవి, గోలి మధుసూదన్ రెడ్డి, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ నాయక్, , ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి రవి, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *