చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో వివాదం..
సిరా న్యూస్,జమ్మికుంట;
బుధవారం నాడు జమ్మికుంట మండలం ఆబాది జమ్మికుంట గుండ్ల చెరువులో చేప పిల్లలను కలిపే కార్యక్రమంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో హాజరై చేప పిల్లలను చెరువులో కలిపారు, అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ హాయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పనులతో ముందుకు తీసుకెళ్లారని ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని, మీడియా సమావేశంలో మాట్లాడుతున్న క్రమంలో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి, తోటి కాంగ్రెస్ నాయకులతో అక్కడికి చేరుకొని, మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పాడి కౌశిక్ రెడ్డిని, ప్రశ్నిస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వంలో డబల్ బెడ్ రూములు ఎందుకు ఇవ్వలేదని, దళితులకు మూడెకరాల భూమి ఎందుకు ఇవ్వలేదని ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని, దళిత బంధు,బీసీ బందు,అందరికీ ఎందుకు ఇవ్వలేదని, ప్రశ్నించారు, పాడి కౌశిక్ రెడ్డి, చేప పిల్లల కార్యక్రమం చేస్తున్నది ప్రభుత్వ పని అని, ఇది టిఆర్ఎస్ మీటింగ్ కాదు అని అన్నారు, అనంతరం దేశిని కోటి, మీడియా సమావేశంలో మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీల పథకాలు అర్హులందరికీ న్యాయం జరిగే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నాయకత్వంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రణవ్ బాబు, ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలతో పాటు హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ప్రజలందరికీ న్యాయం జరిగేలా చేస్తున్న సందర్భంగా ఇంత మంచి పనులు చేస్తుంటే ఓరువలేని, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీని ప్రతిసారి విమర్శించడమే పనిగా పెట్టుకున్నట్లు మాట్లాడుతున్నాడని, ఇంకొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అధికార కార్యక్రమంలో మాట్లాడితే సహించబోమని, హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ పోనగంటి మల్లయ్య, పట్టణ అధ్యక్షులు సుంకరి రమేష్, కౌన్సిలర్లు స్వరూప -శ్రీహరి, పిట్టల శ్వేతా- రమేష్, శ్రీపతి నరేష్, పొనగంటి సారంగం, పొనగంటి రాము,కుతాడి రాజయ్య, దిడ్డి రాము, రావి కంటి రాజు, గుల్లిపూలమ్మ, కాంగ్రెస్ నాయకులు గంగారం మహేష్, ముదిరాజ్ సహకార సంఘం జిల్లా కార్యదర్శి రాకేష్, ఎండి సలీం, ముద్ధమల్ల రవి, అజయ్, లింగారావు, వీరితోపాటు దాదాపు 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు….