ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్..
సిరా న్యూస్,హైదరాబాద్;
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే ప్రశ్నపత్రాలను విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఎన్యుమరెటర్ లకి ఇంటింటి కుటుంబ సర్వే కిట్ లను అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి , డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్లు,ఇతర ముఖ్య అధికారులు. పొన్నం ప్రభాకర్,హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి,రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖతెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమగ్ర కుల ఇంటింటి కుటుంబ సర్వే జరుగుతుంది.జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఎన్యుమరెటర్స్ కి సామాగ్రి అందజేసే కార్యక్రమం ప్రారంభించుకున్నం.సమగ్ర కుల గణన పై ఫిబ్రవరి 4 వ తేది క్యాబినెట్ ఆమోదం చేసుకున్నాం, ఫిబ్రవరి 16 వ తేది అసెంబ్లీ లో కుల గణన పై తీర్మానం చేసుకొని 150 కోట్లు కేటాయించుకోవడం జరిగింది.ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యుమరెటర్ ఉంటారు.
3 రోజుల పాటు ఎన్యుమరేటర్ తనకి కేటాయించిన ఇళ్ళకి స్టిక్కర్ వేస్తారు.9 వ తేది నుండి ఇళ్లకి వెళ్లి సర్వే చేస్తారు.అధికారులు అడిగే సమాచారం ఇవ్వండి గోప్యంగా ఉంచుతారు.అందరికీ సమగ్ర న్యాయం చేయాలని ఈ కార్యక్రమం తీసుకుంటుంది.హైదరాబాద్ జంట నగరాల్లో జీహెచ్ఎంసీ ఏరియా పెద్ద పాత్ర పోషిస్తుంది.సమాచార సేకరణ ఇచ్చే అధికారి ఇంటికి వచ్చే విధంగా ఉంటుంది.కోటి 17లక్షల 44 వేల ఇళ్లకు 85 వేల మంది ఎన్యుమరెటర్స్ ఉన్నారు.గృహ యజమానులకు ఎలాంటి అనుమానం అవసరం లేదు.. ఇది ప్రభుత్వం చేస్తున్న సర్వే.ప్రజలకు ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి ప్రభుత్వం తీసుకుంటున్న సమాచారం గోప్యంగా ఎవరికి న్యాయం జరగాలో వారికి జరిగే విధంగా ఈ సమాచారం ఉంటుంది.మనిషి కి ఇబ్బంది వచ్చినప్పుడు ఎక్స్ రే మాదిరి ఈ సర్వే ఉపయోగపడుతుందని మన నాయకుడు రాహుల్ గాంధీ చెప్పినట్టు ఉపయోగపడుతుంది.దీని వల్ల ఎవరికి అపోహ అవసరం లేదు.రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి కుల గణన ఇంటింటి కుటుంబ సర్వే కి సహకరించండి.రేవంత్ రెడ్డి నాయకత్వములో తెలంగాణ ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతున్నాం.మంత్రులు స్వేచ్చగా తమ శాఖలు నిర్వహిస్తున్నారు. ప్రజలు కలుస్తున్నారు.ప్రతిపక్షాలు ఏదైనా సమస్య ఉంటే సూచనలు ఇవ్వండిప్రతిపక్ష నాయకులకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్న ప్రజలు కుల సంఘాల నాయకులు సహకరించాలని కోరుతున్నా.బోనాలు బతుకమ్మ వినాయక ఉత్సవాలు ఏవి జరిగిన ప్రజలు సహకరిస్తేనే వియవంతం అవుతుంది.కుల గణన కు ప్రజలకు సహకరించాలి అధికారిని ఇంటికి పిలిచి సమాచారం ఇవ్వాలి.ప్రశపత్రాన్ని అనేక రకాలుగా సలహాలు సూచనలు తీసుకొని ప్రశ్నపత్రం రూపొందించడం జరిగింది.జీహెచ్ఎంసీ పరిధిలో 28 లక్షల ఇళ్లు ఉన్నాయి.ప్రతి 10 మంది ఎన్యూమరెటర్స్ కి ఒక పరిశీలకుడు ఒక డేటా అపరెటర్ ఉంటారు.
స్వాతంత్ర్యం రాక ముందు 1931 లో కుల గణన సర్వే జరిగింది. మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది.హైదరాబాద్ రోల్ మోడల్ గా ఉండాలి.స్వతంగా వారి మాటే డిక్లరేషన్. ఆధార్ కార్డు ఆప్షనల్ ఈ సమాచారం ఇండివిజువల్ గా అడగడం లేదు. అందరి సమాచారమ్ సేకరిస్తుంది.ఈ సర్వే పై అనవసర ఆందోళన వద్దు,ఈ సర్వే తెలంగాణ ప్రభుత్వం ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తుందిదేశానికి తెలంగాణ సమగ్ర కుల గణన సర్వే రోల్ మోడల్ అవుతుంది.ఇంటర్నల్ గా సమస్య ఉంటే రాజకీయం చేసుకుందాం..ల కానీ ఈ సర్వే కి అడ్డు వస్తె బలహీన వర్గాల ఆగ్రహానికి గురి కాక తప్పదు,సకల జనులు తెలంగాణ కోసం కలిసి పోరాడినట్టు తెలంగాణ సమాజానికి సమగ్ర కుల గణన సర్వే కి అందరూ కలిసి ముందుకు రావాలి.ఈ నివేదిక గత సర్వే మాదిరి అల్మారా లకి పరిమితం కాదు పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది.