సిరాన్యూస్, ఓదెల
బాధిత కుటుంబాలను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో బీమరపల్లి గ్రామానికి చెందిన మాజీ ఉప్ప సర్పంచ్ సదువు శ్రీనివాస్ రెడ్డి అమ్మ, మాజీ వార్డు మెంబర్ జంగం మధు అమ్మ ఇటీవల మృతి చెందారు. ఈవిషయం తెలుసుకున్న పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష గురువారం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఆమె వెంట బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు మాట్ల రాజయ్య, బొద్దుల రవి, జోంగోని వెంకటేష్ గౌడ్ జిల్లా యూత్ నాయకులు, ఎల్లస్వామి మాజీ సర్పంచ్ బండి సతీష్ రాజయ్య, బీరం రవి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.