సిరాన్యూస్, ఓదెల
దేవాలయ భూమి పూజలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం అబ్బిడిపల్లి గ్రామంలో భీరన్న ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గొల్ల కురుమల ఆరాధ్య దైవమైన బీరన్న స్వామి దేవాలయం త్వరగా పూర్తి కావాలని కోరుకున్నామన్నారు. ఆలయ నిర్మాణానికి భూమి దాతలు జింకరి రవీందర్ స్వరూప ను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో గూడెం మాజీ సర్పంచ్ గోవిందుల ఎల్ల స్వామి, అబ్బిడిపల్లి మాజీ సర్పంచ్ ఓజ్జే శ్రీనివాస్ , తండా మాజీ సర్పంచ్ వస్రం నాయక్, బయమ్మపల్లి యూత్ అధ్యక్షుడు మద్దూరి కుమారస్వామి,ఓదెల మండలం యూత్అధ్యక్షుడు మేడగొని శ్రీకాంత్ గౌడ్, నాంసానిపల్లి యూత్ అధ్యక్షుడు ఈరవోని నాగరాజ్ బండ నిఖిల్ కుమార్ యాదవ్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.