సిరాన్యూస్, ఓదెల
గణపతి పూజలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని గూడెం , నాంసానిపల్లి, ఉప్పరప్పల్లి , పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గణపతి పూజలో పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష పాల్గొన్నారు. ఈసందర్బంగా ఉష ను ప్రజలందరూ ఘనంగా స్వాగతించి వారికి శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో గూడెం సర్పంచ్ ఎల్ల స్వామి, భీరం రవి , గురం సాయివంశీ, చిట్టవేని వీణిత్, శ్రీకాంత్, బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమ కారులు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.