సిరాన్యూస్, ఖానాపూర్ టౌన్
రెంకోని వాగును పరిశీలించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని రెంకొని వాగు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. శుక్రవారం ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రెంకొని వాగును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షాలు ముఖం పట్టగానే బ్రిడ్జి నిర్మాణ పనులను ప్రారంభిస్తామన్నారు.అప్పటి వరకు తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేసి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.