సిరా న్యూస్,ఖమ్మం;
గత వారం ఖమ్మం ను ముంచెత్తిన వరదలతో సర్వం కోల్పోయిన విద్యార్థులకు తమ వంతు గా పుస్తకాలను పంపిణీ చేసినట్లు కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. ప్రకృతి వైపరిత్యాలు విద్యకు ఆటంకం కాకూడదనే సదుద్దేశం తో తమ కళాశాల విద్యార్థుల సహకారంతో స్థానిక సారథి నగర్ లో ని ప్రభుత్వ జూబ్లీ పుర పాఠశాల తో పాటు వేంకటేశ్వర నగర్ లోని పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేశామని కృష్ణ తెలిపారు.తమ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ముంపు ప్రాంతాలలో అన్నదానం నిర్వహించామని, తరగతులు మొదలవటంతో అవస్థలు పడుతున్న విద్యార్థులకు అండగా పుస్తకాల పంపిణీ చేపట్టామని కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డా||జి.ధాత్రి తెలిపారు.తామ విద్యార్థులు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోట రామారావు మరియు ఏం. ఈ.ఓ. రాములు తమకు సహకరించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా||జి.రాజ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పుస్తక పంపిణీకి ముందుకు వచ్చిన కళాశాల విద్యార్థులకు వారు అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డా॥ కె. అమిత్ బింధాజ్, అకడమిక్ డైరెక్టర్స్, గంధం శ్రీనివాసరావు, డా॥ ఎ.వి.వి. శివ ప్రసాద్, జి. ప్రవీణ్ కుమార్, డా॥ జె. రవీంద్రబాబు, డా॥ యన్. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.